Modi: మేం చేపట్టే ప్రతి కార్యక్రమంలో బాలికల సాధికారతకు ప్రాధాన్యం: మోదీ

ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ది కార్యక్రమంలోనూ బాలికల సాధికారితకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మోదీ ట్విటర్‌ వేదికగా ప్రజలకు

Published : 24 Jan 2022 14:52 IST

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మోదీ శుభాకాంక్షలు

దిల్లీ: ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ది కార్యక్రమంలోనూ బాలికల సాధికారతకు తగిన ప్రాధాన్యమిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మోదీ ట్విటర్‌ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘జాతీయ బాలికల దినోత్సవం అనేది.. మా నిబద్ధతను మరోసారి గుర్తుచేసుకోవడానికి, బాలికల సాధికారత కోసం కొనసాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి ఒక సందర్భంగా భావిస్తున్నాం. అంతేకాదు, వివిధ రంగాల్లో అమ్మాయిలు సాధించిన స్ఫూర్తిదాయక విజయాలను వేడుకగా జరుపుకునే రోజు కూడా. మా ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో బాలికల సాధికారతకు, నారీశక్తిని బలోపేతం చేయడానికి అధిక ప్రాధాన్యమిస్తాము. అమ్మాయిల ఆత్మగౌరవంతోపాటు అవకాశాలపైన కూడా దృష్టి సారించాం’’అని ప్రధాని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

మోదీపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రశంసలు

బాలికల సాధికారత కోసం.. ‘బేటీ బచావో-బేటీ పడావో’ వంటి వినూత్న పథకాలను ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తెలిపారు. నేడు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆయన బాలికలకు శుభాకాంక్షలు తెలుపుతూనే.. ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ప్రధాని మోదీ.. మహిళల అభివృద్ధిపై దృక్పథాన్నే మార్చేశారని, వారికి పలు అవకాశాలు కల్పించారని చెప్పారు. అందుకే నేడు దేశంలోని అమ్మాయిలంతా ప్రతి రంగంలోనూ భారత్‌కు మరింత ఖ్యాతి తీసుకొస్తున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న వివిధ పథకాలు, విధానాలతో దేశంలో అమ్మాయిల నిష్పత్తి పెరిగిందని చెప్పుకొచ్చారు. ఇటీవల నిర్వహించిన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే ప్రకారం.. దేశంలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,020 మంది బాలికలు ఉన్నట్లు తేలింది. ఈ విషయాన్నే అమిత్‌ షా గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని