Vijayan: రైల్వేమంత్రితో చర్చిస్తానని ప్రధాని హామీ ఇచ్చారు: విజయన్‌

కేరళలో సిల్వర్‌లైన్‌ రైల్వే ప్రాజెక్టు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే మంత్రితో మాట్లాడతానని చెప్పారని కేరళ సీఎం....

Published : 25 Mar 2022 01:35 IST

తిరువనంతపురం: కేరళలో సిల్వర్‌లైన్‌ రైల్వే ప్రాజెక్టు విషయంలో రైల్వే మంత్రితో మాట్లాడతానని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని కేరళ సీఎం పినరయి విజయన్‌ తెలిపారు. దిల్లీకి వెళ్లిన ఆయన గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. భేటీ అనంతరం విజయన్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను ఈ రోజు ప్రధానిని కలిసినట్టు చెప్పారు. తమ మధ్య మంచి చర్చ జరిగిందన్నారు. ప్రాజెక్టుపై ఏం చేయాలో రైల్వేమంత్రితో చర్చిస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సమావేశం తర్వాత సిల్వర్‌లైన్‌ రైల్‌ ప్రాజెక్టుకు సాధ్యమైనంత త్వరలో ఆమోదం లభిస్తుందని తాము భావిస్తున్నామని విజయన్‌ చెప్పారు.

మరోవైపు సెమీ హై-స్పీడ్‌ రైల్వే ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరసనలు కొనసాగిస్తోంది. ఈరోజు దిల్లీలో యూడీఎఫ్‌ ఎంపీలు నిరసన ప్రదర్శన ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. సిల్వర్‌లైన్ ప్రాజెక్ట్ కారిడార్ సరిహద్దు సర్వే, మార్కింగ్‌పై కేరళలోని లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం నిరసన ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో గురువారం సీఎం పినరయి విజయన్‌ దిల్లీలో ప్రధాని మోదీని కలవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని