Noida International Airport: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టుకు.. మోదీ శంకుస్థాపన

ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌ జిల్లా జెవెర్‌ ప్రాంతంలో నిర్మించనున్న

Published : 25 Nov 2021 14:58 IST

నోయిడా: ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీకారం చుట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ బుద్ధ నగర్‌ జిల్లా జెవెర్‌ ప్రాంతంలో నిర్మించనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధాని గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తదితరులు హాజరయ్యారు. శంకుస్థాపనకు ముందు ఎయిర్‌పోర్టు డిజైన్‌ విశేషాలను మోదీకి.. నిర్మాణ సంస్థ ప్రతినిధులు వివరించారు.

1300 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తోన్న ఈ నిర్మాణం పూర్తయితే ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు ఇదే కానుంది. తొలి దశలో రూ.10,050కోట్లతో దీని పనులు చేపట్టారు. 2024 సెప్టెంబరు/అక్టోబరు నాటికి ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని యూపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఏడాదికి 1.2కోట్ల ప్రయాణికులకు సేవలందించే సామర్థ్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ అత్యాధునిక హంగులతో ఎయిర్‌పోర్టును రూపుదిద్దనున్నారు. దిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ఇది రెండో అంతర్జాతీయ విమానశ్రయం కాగా.. ఉత్తరప్రదేశ్‌లో ఐదోది. దేశంలోనే ఐదు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులున్న ఏకైక రాష్ట్రంగా యూపీ నిలవనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని