Published : 28 Jun 2022 02:10 IST

Rahul Gandhi: యువతనేమో అగ్నివీరులుగా.. మీ స్నేహితులనేమో దౌలత్‌వీరులుగానా..?

దిల్లీ: స్వల్పకాలంలో సైనిక నియామకాల నిమిత్తం కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్‌ పథకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన విమర్శలకు పదునుపెట్టారు. ‘50 సంవత్సరాల పాటు తన స్నేహితులకు విమానాశ్రయాలు కట్టబెట్టి, నరేంద్రమోదీ వారిని దౌలత్‌వీర్‌(ధనవంతులు)గా మార్చుతున్నారు. మరోపక్క నాలుగు సంవత్సరాల కాంట్రాక్ట్‌ పద్ధతిన ఉద్యోగాలు ఇచ్చి యువతను అగ్నివీర్‌గా మార్చుతున్నారు’ అంటూ రాహుల్ విమర్శించారు. 

ఇదే అంశంపై పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. అగ్నిపథ్ పథకం కింద ఉద్యోగంలోకి తీసుకున్న యువత పదవీ విరమణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాల ఉద్యోగం తర్వాత వారి భవిష్యత్తు అనిశ్చితిగా మారుతుందన్నారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే కేంద్రం ఈ పథకాన్ని తీసుకువచ్చిందన్నారు. ‘భాజపా వలే కాకుండా ఎక్కువ ఉద్యోగాలు కల్పించాలన్నదే ఆశయం. నాలుగు నెలల శిక్షణ.. నాలుగు సంవత్సరాల ఉద్యోగం.. ఆ తర్వాత వారి భవిష్యత్తు ఏంటి..? అది పూర్తి అనిశ్చితితో ఉంది. అగ్నిపథ్ పథకం కింద తీసుకున్నవారి పదవీవిమరణ వయస్సును 65 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నాను’ అని మమత వ్యాఖ్యలు చేశారు.  

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts