PM Modi: బడ్జెట్‌ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ

కేంద్ర బడ్జెట్‌ (Budget 2023) సమావేశాలు మొదలవుతున్న వేళ.. కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ కీలక సమావేశం నిర్వహించారు. కీలక శాఖలకు సంబంధించి బడ్జెట్‌ కేటాయింపులపై మంత్రులతో చర్చించినట్లు తెలుస్తోంది. 

Published : 29 Jan 2023 16:33 IST

దిల్లీ: కేంద్ర బడ్జెట్‌ (Budget 2023) వేళ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. ఉదయం 10గంటలకు మొదలైన ఈ సమావేశం.. సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా కీలక శాఖలకు సంబంధించిన కేటాయింపులు.. బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారు సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాదిలో (2023లో) కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే తొలిసారి.

కేంద్ర బడ్జెట్‌ 2023-24ను ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందుకు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా ఇదే. అయితే, కేబినెట్‌ పునఃవ్యవస్థీకరణపై వార్తలు వచ్చిన నేపథ్యంతోపాటు ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని