modi meeting: భాజపా పాలిత రాష్ర్టాల సీఎంలతో మోదీ కీలక సమావేశం

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాశిలో భాజపా  పాలిత రాష్ర్టాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో 12 భాజపా పాలిత రాష్ర్టాలకు చెందినముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

Published : 14 Dec 2021 16:16 IST

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. సమావేశంలో 12 భాజపా పాలిత రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. వరుసగా రెండో రోజు కూడా సీఎంలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో రెండు రోజుల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ రూ.339 కోట్లతో కొత్తగా నిర్మించిన కాశీవిశ్వనాథ్‌ ధామ్‌ ఫేజ్‌-1ను ప్రారంభించారు. సీఎంలతో సమావేశంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా , ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌, ఆ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ధర్మేంద్ర ప్రదాన్‌, యూపీ అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో యూపీ ఎన్నికలకు సంబంధించిన అంశాలు, భాజపా ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలపై ప్రధాని మోదీ చర్చించారు. సుపరిపాలనపై సీఎంలు ప్రధానికి ప్రజంటేషన్‌ ఇచ్చారు. భాజపా పాలిత రాష్ట్రాలసీఎంలు బుధవారం రామ్‌లల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని