Modi: ప్రధాని మోదీకి తొలి ‘మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌’ పురస్కారం

ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం, ఆమె తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ‘మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ అవార్డు’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు.......

Published : 24 Apr 2022 21:26 IST

ముంబయి: జమ్మూ కశ్మీర్‌ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా ముంబయికి చేరుకున్నారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ జ్ఞాపకార్థం, ఆమె తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ‘మాస్టర్‌ దీనానాథ్‌ మంగేష్కర్‌ అవార్డు’ కార్యక్రమాన్ని ప్రధాని ప్రారంభించారు. దేశానికి అత్యుత్తమ సేవలందించినందుకు గాను ఈ మొట్టమొదటి అవార్డు ప్రధాని మోదీకే దక్కడం విశేషం. దేశ నిర్మాణానికి విశేష కృషి చేసిన వ్యక్తికి ప్రతి ఏడాది ఈ అవార్డును ఇవ్వనున్నట్లు లతా మంగేష్కర్‌  కుటుంబంతోపాటు ‘మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్’ గతంలోనే ఓ ప్రకటనలో తెలిపింది. గాన కోకిల తండ్రి దీనానాథ్ మంగేష్కర్ మరణించి నేటికి 80 ఏళ్లు పూర్తయ్యాయి.

సినీ రంగానికి విశేష సేవలందించినందుకు గాను నటులు ఆశా పరేఖ్‌, జాకీ ష్రాఫ్‌లకు మాస్టర్ దీనానాథ్ పురస్కారం (ప్రత్యేక గౌరవం) అందుకున్నారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేశ్‌పాండే, నాటక రంగంలో సేవలందిస్తున్న సంజయ్‌ ఛాయాలకు అవార్డులు దక్కాయి. పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ.. మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ స్మృతి ప్రతిష్ఠాన్ ఛారిటబుల్ ట్రస్ట్‌ సేవలను కొనియాడారు. కరోనా సమయంలో పుణెలోని మంగేష్కర్‌ ఆస్పత్రి ఎన్నో సేవలు అందించిందన్నారు. యోగా, ఆయుర్వేదంలో మన దేశం ప్రపంచానికి దిక్సూచిగా మారిందని కొనియాడారు. గొప్ప సంకల్పంతో దేశం ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని