PM Modi: పాకిస్థాన్‌ నూతన ప్రధానికి అభినందనలు తెలిపిన మోదీ

పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన షెహబాజ్‌ షరీఫ్‌(70)కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.

Updated : 12 Apr 2022 06:28 IST

దిల్లీ: పాకిస్థాన్‌ నూతన ప్రధానిగా ఎన్నికైన పీఎంఎల్‌(ఎన్‌) అధ్యక్షుడు షెహబాజ్‌ షరీఫ్‌(70)కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ‘‘పాకిస్థాన్‌ ప్రధానిగా ఎన్నికైన మియాన్‌ ముహమ్మద్‌ షెహ్‌బాజ్‌ షరీఫ్‌కు అభినందనలు. భారత్‌ ఎల్లప్పటికీ శాంతి, స్థిరత్వాన్ని కోరుకుంటుంది.  ఉగ్రవాదం లేని ప్రాంతంలో మనం అభివృద్ధి సవాళ్లపై దృష్టిసారించవచ్చు. ఇది మన ప్రజలకు ఎంతో శ్రేయస్కరం’’ అని మోదీ పేర్కొన్నారు. 

ఎన్నో మలుపుల మధ్య ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ ఖాన్‌ వైదొలిగారు. దీంతో ప్రతిపక్షాలు ప్రతిపాదించిన షెహబాజ్‌కు పాకిస్థాన్‌ నేషనల్ అసెంబ్లీ నుంచి సంపూర్ణ మద్దతు లభించడంతో ఆయన ప్రధానిగా ఎన్నికయ్యారు.   


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని