Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షల వెల్లువ

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.........

Updated : 06 Aug 2022 22:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థి అయిన ధన్‌ఖడ్‌ విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాపై 346 ఓట్ల తేడాతో గెలుపొందారు. మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. ధన్‌ఖడ్‌కు 528, మార్గరెట్ ఆళ్వాకు 182 ఓట్లు వచ్చాయి. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. ఉప రాష్ట్రపతిగా ఆయన ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షా నేరుగా వెళ్లి ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలుపగా.. పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు తెలియజేశారు.

భారతదేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు హృదయపూర్వక అభినందనలు. మీ అపార అనుభవం, న్యాయ నిపుణతతో దేశం ఎంతో ప్రయోజనం పొందుతుంది. ఈ పదవిలో విజయవంతంగా కొనసాగేందుకు నా శుభాకాంక్షలు -ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు. ఎంతో గౌరవంతో విపక్షాలకు ప్రాతినిథ్యం వహించిన మార్గరెట్‌ ఆళ్వాకు ధన్యవాదాలు -రాహుల్‌ గాంధీ

భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అభినందనలతోపాటు శుభాకాంక్షలు -సోనియా గాంధీ

దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు అభినందనలు. ఉపరాష్ట్రపతిగా మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నా -ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన ధన్‌ఖడ్‌కు అభినందనలు. పార్టీలకతీతంగా ఈ ఎన్నికల్లో నాకు ఓటు వేసిన ప్రతిపక్ష నేతలందరికీ, ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిస్వార్థంగా ప్రచారంలో పాల్గొన్న స్వచ్చంధ కార్యకర్తలకు ధన్యవాదాలు -మార్గరెట్‌ ఆళ్వా

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌కు శుభాకాంక్షలు. రైతు కుటుంబం కావడంతో ప్రజా జీవితంలో ఆయనకున్న అపారమైన అనుభవాలు దేశానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయనకు నా గ్రీటింగ్స్‌ -కేంద్రమంత్రి జయశంకర్‌ ప్రసాద్‌

ఆయన ఓ అద్భుతమైన రాజ్యసభ ఛైర్మన్‌గా, అత్యుత్తమ ఉపరాష్ట్రపతి నిలుస్తారు. ఓ రైతు కుమారుడు, ఉత్తమ న్యాయనిపుణుడు ఉపరాష్ట్రపతిగా ఉండటం దేశానికి ఆశీర్వాదం. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం లభించడం మా అదృష్టం -కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్







Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని