Corona: దేశంలో కరోనా ఉద్ధృతి.. సీఎంలతో ప్రధాని సమావేశం ప్రారంభం

దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. నిన్న దాదాపు రెండున్నర లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి.

Published : 13 Jan 2022 17:02 IST

దిల్లీ: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా దాదాపు రెండున్నర లక్షల కొత్త కేసులు వెలుగుచూశాయి. ఈ ఉద్ధృతి వేళ.. ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమయ్యారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితుల గురించి వారితో చర్చిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

అలాగే వైరస్ కట్టడికి రాష్ట్రాలు విధిస్తున్న ఆంక్షలు, టీకా కార్యక్రమం అమలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను సమీక్షించనున్నారు. కాగా, ఈ సమావేశానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హాజరుకాకపోవచ్చని సంబంధిత వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. ఆయన స్థానంలో ఆరోగ్య మంత్రి పాల్గొంటారని పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా.. దేశంలో కరోనా కేసుల పెరుగుదల క్రియాశీల కేసులపై పడింది. ప్రస్తుతం 11 లక్షల మందికి పైగా వైరస్‌తో బాధపడుతున్నారు. పాజిటివిటీ రేటు 13 శాతానికి చేరింది. ఒమిక్రాన్ కేసులు 5,488కు పెరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని