Varanasi: వారణాసిలోని కాలభైరవ ఆలయంలో ప్రధాని మోదీ పూజలు!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తున్నారు. ఉదయం 10.30 సమయంలో వారణాసికి చేరుకున్న మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. అనంతరం కాలభైరవ దేవాలయానికి చేరుకున్న మోదీ.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోకి జనాలు రావడంతో

Updated : 13 Dec 2021 12:22 IST

లఖ్‌నవూ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో పర్యటిస్తున్నారు. ఉదయం 10.30 సమయంలో వారణాసికి చేరుకున్న మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ స్వాగతం పలికారు. అనంతరం కాలభైరవ దేవాలయానికి చేరుకున్న మోదీ.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోకి జనాలు రావడంతో వారికి మోదీ అభివాదం చేశారు. మరికాసేపట్లో పవిత్ర కాశీ విశ్వనాధుడి ఆలయ సుందరీకరణ పనులు, గంగా నదిని కలుపుతూ నిర్మించిన నడవాను ప్రధాని మోదీ ప్రారంభించి.. ప్రజలకు అంకితం చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ మఠాలకు చెందిన 3 వేల మంది సాధువులు, మత పెద్దలు. కళాకారులు, పురప్రముఖులతో పాటు భాజపా పాలిత 12 రాష్ట్రాల సీఎంలూ పాల్గొననున్నారు. నడవాను ప్రారంభించిన తర్వాత గంగానదిలో విహార నౌకపై సీఎంలతో మోదీ సమావేశం కానున్నారు. గంగా హారతిని కూడా నౌక నుంచే వీక్షించనున్నారు.

Read latest National - International News and Telugu News



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని