IN PICS: పుణె మెట్రో రైలు ప్రాజెక్ట్‌ ప్రారంభం.. టికెట్‌ కొని ప్రయాణించిన మోదీ

మహారాష్ట్రలో ప్రధాన నగరాల్లో ఒకటైన పుణె వాసులకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం ఈ సేవలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.

Published : 07 Mar 2022 01:12 IST

పుణె: మహారాష్ట్రలో ప్రధాన నగరాల్లో ఒకటైన పుణె వాసులకు మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఆదివారం ఈ సేవలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. మొత్తం 32.2 కిలోమీటర్ల ప్రాజెక్టులో 12 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. గర్వారే స్టేషన్‌లో పచ్చజెండా ఊపి మెట్రో రైలు సేవలను ప్రధాని మోదీ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీనే స్వయంగా కియోస్క్‌ ద్వారా టికెట్‌ కొనుగోలు చేశారు. అనంతరం గర్వారే స్టేషన్‌ నుంచి ఆనంద్‌నగర్‌ స్టేషన్‌ వరకు మెట్రో 5 కిలోమీటర్ల దూరం రైలులో 10 నిమిషాల పాటు ప్రయాణించారు. ఈ సందర్భంగా రైల్లో దివ్యాంగ చిన్నారులతో ముచ్చటించారు. అంతకుముందు గర్వారే స్టేషన్‌లో మెట్రో రైలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 

పుణె మెట్రో ప్రాజెక్టు కోసం మొత్తం రూ.11,400 కోట్లు వెచ్చించారు. దీనికి 2016 డిసెంబర్‌లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. మొత్తం 32.2 కిలోమీటర్ల దూరం కలిగిన మెట్రో రైల్వే నెట్‌వర్క్‌లో ప్రస్తుతం 12 కిలోమీటర్లు అందుబాటులోకి వచ్చింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే దూరంగా ఉన్నారు. అందుకు గల కారణాలను ప్రభుత్వ వర్గాలు వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని