Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ

జపాన్‌ ప్రధాని కిషిద (Fumio Kishida)తో కలిసి ప్రధాని మోదీ (Modi) పానీపూరీ (Pani puri)ని ఆరగించారు. ఈ రుచిని ఇష్టపడిన కిషిద మరోటి కావాలంటూ అడిగి మరీ తిన్నారు.

Published : 21 Mar 2023 13:46 IST

దిల్లీ: భారత పర్యటనకు వచ్చిన జపాన్‌ (Japan) ప్రధానమంత్రి ఫుమియో కిషిద (Fumio Kishida)కు మన దేశ వంటకాలను రుచి చూపించారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi). ప్రత్యేకంగా భారత్‌లో ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ అయిన పానీపూరీ (గోల్‌గప్ప)ని ఆయనకు తినిపించారు. మన పానీపూరీ (Pani puri) రుచి జపాన్‌ ప్రధానికి ఎంతగానో నచ్చేసిందట.

భారత్‌ (India), జపాన్‌ (Japan) మధ్య సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించేందుకు గానూ ఇరు దేశాల ప్రధానులు సోమవారం దిల్లీలోని బుద్ధ జయంతి పార్క్‌ను సందర్శించారు. ఉద్యానవనమంతా కలియదిరుగుతూ వీరిద్దరూ  ముచ్చటించారు. అనంతరం అక్కడి ఫుడ్‌ స్టాళ్ల వద్దకు వెళ్లి భారతీయ అల్పాహార వంటకాలను, పానీయాలను రుచిచూశారు. ఇరు దేశాల ప్రధానులు కవ్వంతో మజ్జిక చిలికారు. ఆ తర్వాత కిషిదకు ప్రధాని మోదీ పానీపూరీ (Pani Puri) గురించి చెప్పి దాని రుచి చూపించారు. ఆ రుచిని ఇష్టపడ్డ జపాన్‌ ప్రధాని ఇంకోటి కావాలని అడిగారు. పానీపూరీ (Golgappa)తో పాటు ఫ్రైడ్‌ ఇడ్లీ, మామిడితో చేసిన షర్‌బత్‌ను కిషిద రుచిచూశారు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలను ప్రధాని మోదీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా జపాన్‌ ప్రధాని కిషిదకు ప్రధాని ప్రత్యేక కానుకలను అందించారు. చందనపు చెక్కపై చెక్కిన బుద్ధుని ప్రతిమను బహూకరించారు. బాల్‌బోధి మొక్కను కూడా కిషిదకు మోదీ కానుకగా ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని