- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
PM Kisan: ₹19 వేల కోట్లు విడుదల
దిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) కింద ఎనిమిదో విడత పెట్టుబడి సాయాన్ని ప్రధాని నరేంద్రమోదీ విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని రూ.19వేల కోట్ల సాయాన్ని అందించారు. దేశ వ్యాప్తంగా 9.5 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. ఇంతకు ముందు ఏడు విడతల్లో నిధులు విడుదల చేసినప్పటికీ.. అత్యధికంగా ఈసారి రూ.19వేల కోట్లు విడుదల చేయడం గమనార్హం.
రైతులను ప్రోత్సహించేందుకే కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. సేంద్రీయ వ్యవసాయం దిశగా రైతులు అడుగు వేయాలని ఆకాంక్షించారు. ఇలా చేయడం వల్ల నేల సారవంతమవుతుందని, సేంద్రీయ వ్యవసాయం ద్వారా వచ్చే ఉత్పత్తులు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా కొద్ది మంది లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు బంజరు భూమిని సేంద్రీయ వ్యవసాయానికి అనువుగా మార్చుకొని పంటలు పండిస్తున్నానని ప్రధానితో చెప్పారు. దీనిపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. మిగతావారందరికీ ఓ మార్గదర్శిగా నిలిచావని కితాబిచ్చారు.
రైతులు వేసే పంటలకు పెట్టుబడి సాయం నిమిత్తం 2019లో కేంద్రం పీఎం-కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. అప్పటి నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6000 పెట్టుబడి సాయాన్ని మూడు వాయిదాల్లో అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకోసారి రూ. 2వేల చొప్పున ఈ సాయాన్ని ఇస్తోంది. ఈ మొత్తం నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేస్తోంది. కిసాన్ సమ్మాన్ ద్వారా ఇప్పటివరకు రూ. 1.15 లక్షల కోట్లను అన్నదాతలకు అందించింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు
-
Movies News
Chiranjeevi: సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ ట్రోఫీ.. జెర్సీని ఆవిష్కరించిన చిరంజీవి
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Manish Sisodia: 16 మంది నిందితుల్లో సిసోదియా నం.1: సీబీఐ ఎఫ్ఐఆర్
-
Movies News
ponniyin selvan: ‘పొన్నియిన్ సెల్వన్’కు ద్వారాలు తెరిచింది ‘బాహుబలి’
-
India News
Noida Twin Towers: అంతా సిద్ధం! ఆ 40 అంతస్తుల టవర్లు ఎలా కూల్చుతారంటే..?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Puri Jagannadh: ఛార్మితో రిలేషన్‌షిప్‌పై పెదవి విప్పిన పూరి జగన్నాథ్
- మూడో కంటికి తెలియకుండా రెండు ఉద్యోగాలు.. ఇప్పుడు రిటైర్మెంట్
- China: వరుణాస్త్రం బయటకు తీసిన డ్రాగన్..! ఎందుకు..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (19/08/2022)
- రూ.20కోట్ల నగల దోపిడీలో ఊహించని ట్విస్ట్.. ఇన్స్పెక్టర్ ఇంట్లో 3.7కిలోల బంగారం
- Vijay Deverakonda: తెలుగు ప్రెస్‌మీట్ వివాదం.. స్పందించిన విజయ్ దేవరకొండ
- Chahal-Dhanashree: విడాకుల రూమర్లపై స్పందించిన యుజువేంద్ర చాహల్
- Sanna Marin: మరో వివాదంలో ఫిన్లాండ్ ప్రధాని.. డ్యాన్స్ వీడియో వైరల్!
- Tamil rockerz Review: రివ్యూ: తమిళ్ రాకర్స్
- Sehwag - Akhtar: నిన్ను ఓపెనర్‌గా పంపించాలనే ఐడియా ఎవరిది..?