PM Kisan Samman nidhi: ‘పీఎం-కిసాన్‌’ నిధుల విడుదల.. రైతుల ఖాతాల్లోకి రూ.20 వేల కోట్లు

‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌నిధి’ 17వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు.

Published : 18 Jun 2024 18:25 IST

వారణాసి: రైతులకు వ్యవసాయంలో పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం-కిసాన్‌ సమ్మాన్‌నిధి’ 17వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) విడుదల చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో మంగళవారం నిర్వహించిన ‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో దాదాపు 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2వేలు చొప్పున రూ.20 వేల కోట్లు జమ కానున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం, ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వారణాసిలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి.

‘మన్‌ కీ బాత్‌’ రిటర్న్స్‌.. ఐడియాల కోసం ప్రధాని పిలుపు!

నరేంద్ర మోదీ ఈనెల 9వ తేదీన వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఆ మరుసటి రోజు పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ‘పీఎం కిసాన్‌’ 17వ వాయిదా చెల్లింపు దస్త్రంపైనే తొలి సంతకం చేశారు. కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకం అమలు చేస్తోంది. దీనికింద అర్హులైన రైతులకు ఏటా మూడు విడతల్లో రూ.2వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని