మోదీపైనే సంసద్‌ టీవీ ఫోకస్‌.. తప్పుబట్టిన కాంగ్రెస్‌

పార్లమెంటరీ సమావేశాల్లో ప్రధాని మోదీని 73 సార్లు టీవీలో చూపించడంపై కాంగ్రెస్‌ మండిపడింది.

Published : 27 Jun 2024 21:10 IST

దిల్లీ: పార్లమెంట్‌లో ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. 18వ లోక్‌సభతో పాటు రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఎక్కువ సార్లు టీవీలో చూపించడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. లైవ్‌ కవర్‌ చేసిన సంసద్‌ టీవీపై విమర్శలు చేసింది.

‘‘ ఈ కార్యక్రమాన్ని కవర్‌ చేసిన టీవీ మాత్రం అక్కడున్న ప్రధాని మోదీపై ఫోకస్‌ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని టీవీలో కేవలం ఆరు సార్లు చూపించగా.. మోదీని మాత్రం 73 సార్లు చూపించింది. ఇది 12 రెట్లు ఎక్కువ. అధికార పార్టీ నేతలను 108 సార్లు.. ప్రతిపక్ష నేతలను 18 సార్లు చూపించారు. టీవీ కేవలం సభా కార్యక్రమాలను కవర్‌ చేయాలే గానీ.. స్వామి భక్తి చూపకూడదు’’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జై రాం రమేశ్‌ ‘ఎక్స్‌’ (ట్విటర్‌ ) వేదికగా విమర్శించారు.

‘ఇకపై లిఫ్ట్‌లో సీక్రెట్‌ మీటింగ్‌’.. ఫడణవీస్‌తో భేటీపై ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు

సంసద్‌ టీవీ భారత పార్లమెంటరీ ఛానెల్‌. లోక్‌సభ, రాజ్యసభలోని టెలివిజన్‌లను విలీనం చేసి 2021లో కేంద్ర ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ఇది ఉభయ సభల కార్యక్రమాలతో పాటు ఇతర ప్రజా వ్యవహారాల కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది. కాగా.. ఉభయ సభలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము.. నీట్‌, నెట్‌ ప్రవేశ పరీక్షల్లో వెలుగుచూసిన అక్రమాల గురించి ప్రస్తావించారు. పరీక్షల్లో పారదర్శకత ప్రాముఖ్యతను వివరించారు. నీట్‌ సహా తదితర పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని