Narendra Modi: పెరిగిన ప్రధాని మోదీ ఆస్తుల విలువ

ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 3.7కోట్లకు చేరింది.....

Published : 26 Sep 2021 01:43 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఆస్తులు గతేడాది కంటే కాస్త పెరిగాయి. ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ రూ. 3.7కోట్లకు చేరింది. ప్రతి ఏడాది ఆస్తులు, అప్పులు వివరాలను వెల్లడిస్తున్న మోదీ.. ఈ ఏడాది మార్చి 31 నాటి వివరాలను బహిర్గతం చేశారు. 2020లో రూ. 2.85కోట్లు ఉండగా.. ప్రస్తుతానికి ఆయన ఆస్తులు 22 లక్షలు పెరిగాయి. ప్రభుత్వం నుంచి పొందే రూ. 2లక్షల జీతమే ప్రధానికి ముఖ్య ఆదాయ వనరుగా ఉంది. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో పెట్టడం, వాటివల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడమే ఆయన ఆదాయంలో వృద్ధికి కారణమని తెలుస్తోంది.

గుజరాత్‌లోని గాంధీనగర్ ఎస్‌బీఐ బ్రాంచ్‌లో మోదీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల విలువ గతేడాది రూ. 1.60కోట్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ. 1.86కోట్లకు పెరిగింది. మోదీ వద్ద 4 బంగారపు ఉంగరాలు ఉండగా వాటి విలువ 1.48 లక్షలుగా ఉంది. బ్యాంక్ బ్యాలెన్స్ రూ. 1.5లక్షలు, నగదు రూపంలో రూ. 36వేలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. 2014లో ప్రధాని అయినప్పటి నుంచి ఇప్పటివరకు మోదీ ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదు. సొంత వాహనం కూడా లేదు. 2002లో మోదీ సహా మరో ముగ్గురు వాటాదార్లు కొనుగోలు చేసిన నివాస భవనం విలువ రూ. 1.10కోట్లుగా ఉంది. ప్రజా జీవితంలో పారదర్శకతకు 2004లో వాజ్‌పేయీ ప్రభుత్వం ఆస్తుల వెల్లడి ప్రక్రియ ప్రారంభించగా.. అప్పటి నుంచి రాజకీయ నేతలు ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని