Afghanistan: అఫ్గాన్‌ పరిస్థితులపై రష్యా అధినేత పుతిన్‌తో ప్రధాని మోదీ చర్చ

అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులు, ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడారు. ఇద్దరు ఫోన్‌లో దాదాపు 45 నిమిషాలపాటు సంభాషించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ ఈ విషయంపై ట్వీట్‌ చేశారు...

Updated : 24 Aug 2021 19:54 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులు, ఈ క్రమంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అధినేత వ్లాదిమిర్‌ పుతిన్‌తో మాట్లాడారు. ఇద్దరు ఫోన్‌లో దాదాపు 45 నిమిషాలపాటు సంభాషించుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ ఈ విషయంపై ట్వీట్‌ చేశారు. ‘అఫ్గాన్‌లోని ఇటీవలి పరిణామాలపై నా స్నేహితుడు, రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో వివరణాత్మక చర్చ జరిగింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు పరస్పర సహకారంతో తీసుకోవాల్సిన చర్యలతోపాటు ద్వైపాక్షిక ఎజెండాలోని ఆయా అంశాలపై కూడా చర్చించాం. ప్రధాన సమస్యలపై సంప్రదింపుల కొనసాగింపునకు అంగీకరించాం’ అని అందులో పేర్కొన్నారు. అఫ్గాన్‌లో భద్రతా పరిస్థితులు, ప్రపంచంపై దాని ప్రభావం, పౌరుల తరలింపు, శాంతిభద్రతల ఆవశ్యకత తదితర అంశాలపై వారిద్దరు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. సోమవారం నరేంద్ర మోదీ ఇదే విషయమై జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కల్‌తో మాట్లాడిన విషయం తెలిసిందే.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని