IN PICS: గుజరాత్‌ తుది పోరు వేళ తల్లి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోదీ

గుజరాత్‌ తుది విడత పోలింగ్‌(Gujarat Election2022) సోమవారం జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగగానే నేరుగా గాంధీనగర్‌లోని రైసన్‌ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్‌ మోదీ(Heeraben Modi) నివాసానికి వెళ్లారు.

Published : 04 Dec 2022 20:25 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ తుది విడత పోలింగ్‌(Gujarat Election2022) సోమవారం జరగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆదివారం సాయంత్రం అహ్మదాబాద్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగగానే నేరుగా గాంధీనగర్‌లోని రైసన్‌ ప్రాంతంలో ఉంటున్న తన తల్లి హీరాబెన్‌ మోదీ(Heeraben Modi) నివాసానికి వెళ్లారు. ఆమె కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నారు. గాంధీనగర్‌లోని భాజపా కార్యాలయానికి చేరుకోవడానికి ముందు దాదాపు 45నిమిషాల పాటు తన మాతృమూర్తితోనే ముచ్చటిస్తూ ఆమెతోనే సమయం గడిపారు. ఇంట్లో సోఫాలో కూర్చొని తల్లితో మోదీ మచ్చటిస్తున్నట్టు ఫొటోల్లో చూడొచ్చు. అనంతరం పార్టీ కార్యాలయానికి చేరుకున్న మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌, ఇతర సీనియర్  నేతలు స్వాగతం పలికారు.

మరోవైపు, అహ్మదాబాద్‌లోని రనిప్‌ ప్రాంతంలోని ఓ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకుంటారని జిల్లా కలెక్టర్‌ వెల్లడించారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కూడా నారన్‌పూర్‌ ప్రాంతంలోని మున్సిపల్‌ సబ్‌ జోనల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటేయనున్నారు. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు గాను డిసెంబర్‌ 1న 89 సీట్లకు తొలి విడతలో పోలింగ్‌ జరగ్గా 63.31శాతం పోలింగ్‌ నమోదైంది. ఇకపోతే, డిసెంబర్‌ 5న మిగిలిన 93స్థానాలకు రెండో దశలో పోలింగ్‌ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని