PM Modi: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. 11 గంటలకు లోక్‌సభలో మోదీ ప్రసంగం
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా తొలి రోజు ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రసంగించనున్నారు.
దిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు (Parliament Session) సోమవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు సమావేశాల్లో భాగంగా ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ (PM Modi) లోక్‌సభ (Lok Sabha)లో ప్రసంగించనున్నారు. అయిదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో పార్లమెంటు 75ఏళ్ల ప్రస్థానంపై చర్చలతోపాటు నాలుగు బిల్లులను ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ చర్చను ప్రధాని మోదీ ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రత్యేక సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు, శూన్యగంట వంటివి ఉండబోవని కేంద్రం ఇదివరకే ప్రకటించింది. దీంతో ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ప్రారంభం కాగానే.. లోక్‌సభలో ప్రధాని మోదీ చర్చను ప్రారంభించనున్నారు. ‘‘రాజ్యాంగ పరిషత్తు ఆవిర్భావం నుంచి 75 ఏళ్లలో పార్లమెంటు ప్రస్థానం, విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు’’ అంశంపై ప్రధాని ప్రసంగించనున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి. మోదీ తర్వాత పలువురు కేంద్రమంత్రులు, ప్రతిపక్ష నేతల సభ్యులు కూడా ఈ చర్చలో పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు. సోమవారం నాటి సమావేశం పార్లమెంట్ పాత భవనంలో జరగనుంది. మంగళవారం నుంచి నూతన భవనంలో సమావేశాలు కొనసాగనున్నాయి.
ఎందుకీ ‘ప్రత్యేకం’! రాజ్యాంగంలో లేని ‘ప్రత్యేకం’ ప్రస్తావన
ఏయే బిల్లులు రానున్నాయంటే..
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల హోదాపై బిల్లు ఈ విడత సమావేశాల్లో మళ్లీ చర్చకు రానుంది. సీఈసీ, ఈసీలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉన్నారు. దీనిని కేబినెట్ కార్యదర్శి స్థాయికి తగ్గించేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దానిపై విపక్షం అప్పుడే పెద్దఎత్తున నిరసన గళం వినిపించింది. ఈ బిల్లుతో పాటు చట్టసభల్లో మహిళలకు 33% కోటా కల్పించే అంశాన్ని చర్చకు తీసుకురావచ్చని భావిస్తున్నారు. తగిన సమయంలో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ సమావేశానంతరం చెప్పారు. న్యాయవాదుల (సవరణ) బిల్లు, పత్రికల బిల్లు, పోస్టాఫీసు బిల్లు, వృద్ధుల సంక్షేమం వంటి ఎనిమిది అంశాలు పార్లమెంటు ముందుకు రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
GST collections: సెప్టెంబరు జీఎస్టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి
-
Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Rohit Sharma: నా దృష్టిలో అతడే కఠినమైన బౌలర్: రోహిత్ శర్మ
-
PM Modi: తెలంగాణలో వచ్చే ఎన్నికల తర్వాత చెప్పింది చేసే ప్రభుత్వం: ప్రధాని మోదీ
-
TMC: దిల్లీలో మాపై లాఠీలు విరిగితే.. పశ్చిమబెంగాల్లోనూ విరుగుతాయ్ : బెంగాల్ మంత్రి పార్థ భౌమిక్
-
Linda Yaccarino:‘ఎక్స్’రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతోంది: లిండా యాకారినో