Doctors Day: వైద్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న మోదీ

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 

Updated : 12 Nov 2022 10:02 IST

రేపు జాతీయ వైద్యుల దినోత్సవం

దిల్లీ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రధాని నరేంద్ర మోదీ వైద్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారత వైద్య సంఘం(ఐఎంఏ) నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన మాట్లాడనున్నారు. ప్రముఖ వైద్య నిపుణుడు, పశ్చిమ్ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత బిధాన్ చంద్రరాయ్ గౌరవార్థం జులై ఒకటో తేదీని వైద్యుల దినోత్సవంగా జరుపుకొంటారు. 

తన ప్రసంగం గురించి మోదీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ‘కొవిడ్-19 కట్టడిలో వైద్యుల కృషి పట్ల భారత్ గర్వంగా ఉంది. వారి సేవలకు గుర్తుగా జులై ఒకటోతేదీని వైద్యుల దినోత్సవంగా జరుపుకొంటున్నాం. ఐఎంఏ నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో రేపు మధ్యాహ్నం మూడు గంటలకు వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నాను’ అని తెలిపారు. దేశంలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించడంలో వైద్యులు అలుపెరగని సేవ చేస్తున్నారు. ఈ క్రమంలో వారిలో కొందరు వైరస్‌కు బలయ్యారు. రెండో దఫా ఉద్ధృతిలో దాదాపు 800 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐఎంఏ వెల్లడించింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు