PM Modi: ఈనెల 21న ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రసంగం.. ఎందుకంటే?

ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. .....

Published : 18 Apr 2022 20:39 IST

దిల్లీ: ఈ నెల 21న ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగించనున్నట్టు కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. సిక్కు గురువు గురు తేగ్‌ బహదూర్‌ 400వ ప్రకాశ్ పర్వ్ ‌(జయంతి) సంరద్భంగా గురువారం రోజున దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని తెలిపింది. తేగ్‌ బహదూర్‌ స్మారకార్థం నాణెంతో పాటు పోస్టల్‌ స్టాంపును విడుదల చేయనున్నారని పేర్కొంది. ఈ శుభసందర్భంలో 400 మంది సిక్కు సంగీతకారులు షాబాద్‌ కీర్తనలను ఆలపిస్తారని మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్‌ కమిటీ, కేంద్ర సాంస్కృతికశాఖ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్నట్టు పేర్కొంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గురు తేగ్‌ బహదూర్‌ జయంతి వేడుకల్లో పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ, విదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని