Narendra Modi: ఎయిమ్స్‌లో ‘విశ్రమ్‌ సదన్‌’ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ  

క్యాన్సర్‌ బాధితుల సంక్షేమార్థం దిల్లీలోని ఎయిమ్స్‌ క్యాంపస్‌లో నిర్మించిన 806 పడకలు ఉన్న ఏసీ గదుల భవనం ‘విశ్రమ్‌ సదన్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Updated : 21 Oct 2021 13:43 IST

 

దిల్లీ: క్యాన్సర్‌ బాధితుల సంక్షేమార్థం దిల్లీలోని ఎయిమ్స్‌ క్యాంపస్‌లో నిర్మించిన 806 పడకలు ఉన్న ఏసీ గదుల భవనం ‘విశ్రమ్‌ సదన్‌’ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఇన్ఫోసిస్‌ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం రోగులందరూ ఎన్నో రోజులు దిల్లీలోని ఎయిమ్స్‌లో ఉండాల్సి వస్తుంది. వారితో వచ్చిన సహయకులు కొన్నిసార్లు ఇబ్బుందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్ఫోసిస్‌ సంస్థ రూ.93 కోట్లతో ప్రత్యేకంగా ఎయిర్‌ కండిషనర్ (ఏసీ) గదులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించినున్న ఈకార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయతో పాటు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌, ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ సుధామూర్తి పాల్గొననున్నట్లు పీఎంఓ కార్యాలయం తెలిపింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు