Parliament: పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నూతన పార్లమెంట్‌ భవనాన్ని మే 28న ప్రారంభించనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా వెల్లడించారు.

Updated : 18 May 2023 21:51 IST

దిల్లీ: దేశ రాజధానిలో సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో (Central Vista) భాగంగా చేపట్టిన నూతన పార్లమెంట్‌ భవనం (New Parliament) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మే 28న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) చేతులమీదుగా ఈ అద్భుత కట్టడాన్ని ప్రారంభించనున్నట్లు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా(Om Birla) వెల్లడించారు. అంతేకాకుండా లోక్‌సభ, రాజ్యసభలోనూ మార్షల్స్‌కు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ నిర్ణయించినట్లు తెలిపారు. 

ఈ నెల చివరి వారంలో పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రారంభించనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ప్రధానిగా తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న దృష్ట్యా.. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభిస్తారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. మే 26, 2014లో భారత ప్రధానిగా నరేంద్ర మోదీ తొలిసారి బాధ్యతలు చేపట్టగా.. మే 30, 2019న రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు