
All party meeting: మోదీ అధ్యక్షతన ఆదివారం అఖిలపక్ష సమావేశం!
దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ నెల 28న (ఆదివారం) అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఈ నెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 28న ఉదయం 11గంటలకు అఖిలపక్ష పార్టీల సమావేశం జరగనుంది. అదే రోజు సాయంత్రం భాజపా పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించనున్నారు. అలాగే, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాల ఫ్లోర్‌లీడర్ల సమావేశం కూడా మధ్యాహ్నం 3గంటలకు జరగనున్నట్టు సమాచారం.ఈ సమావేశాలకు కూడా మోదీ హాజరు కానున్నట్టు తెలుస్తోంది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబరు 23 వరకు నిర్వహించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. కొవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ సమావేశాలు నిర్వహించాలని సూచించింది. కొవిడ్ మహమ్మారి ప్రభావంతో గతేడాది శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలనూ కుదించారు. ఈ దఫా పార్లమెంటు ఉభయ సభలు 20 రోజుల పాటు సమావేశం కానున్నాయి. కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్ సహా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది.
► Read latest National - International News and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra: శిందే వర్గానికి 13.. భాజపాకు 25..!
-
General News
Assam: సినిమాటిక్ స్టైల్లో విద్యార్థినికి ప్రపోజ్ చేసి.. ఉద్యోగం కోల్పోయాడు!
-
Sports News
India vs England: ఇంగ్లాండ్‌తో తొలి టీ20.. టాస్ గెలిచిన టీమిండియా
-
Technology News
Google Chrome: క్రోమ్ యూజర్లకు జీరో-డే ముప్పు.. బ్రౌజర్‌ను అప్డేట్ చేశారా?
-
World News
Monkeypox: 59 దేశాలకు పాకిన మంకీపాక్స్.. కేసులెన్నంటే?
-
Movies News
Murali Mohan: ‘గాడ్ ఫాదర్’లో ఆ లుక్ కావాలని చిరంజీవి అడిగారు: మురళీ మోహన్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Chandrababu: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?