సీఎంలతో భేటీ కానున్న ప్రధాని

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి దేశం సిద్ధమవుతున్న....

Published : 08 Jan 2021 19:07 IST

దిల్లీ: అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి భేటీ కానున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సీఎంలతో మాట్లాడనున్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీకి దేశం సిద్ధమవుతున్న తరుణంలో సీఎంలతో ప్రధాని సమావేశం కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

ఇప్పటికే సీరం ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌లు రూపొందించిన కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వ్యాక్సిన్ల పంపిణీకి సంబంధించి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ పంపిణీకి సంబంధించి ముందస్తు ఏర్పాట్లలో భాగంగా డ్రైరన్‌ నిర్వహించారు. మరోవైపు మరికొన్ని రోజుల్లోనే టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కానుండడం గమనార్హం.

ఇవీ చదవండి..
త్వరలో దేశ ప్రజలకు కరోనా టీకా!
ఆర్మీ క్యాంటీన్‌ వస్తువులు ఇకపై ఆన్‌లైన్‌లో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని