Netaji statue: ఇండియా గేట్‌ వద్ద నేతాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకొని రాజధాని దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద నేతాజీ హోలోగ్రామ్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు.......

Published : 23 Jan 2022 20:00 IST

దిల్లీ: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 125వ జయంతిని పురస్కరించుకొని రాజధాని దిల్లీలోని ఇండియా గేట్‌ వద్ద నేతాజీ హోలోగ్రామ్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ప్రధాని సహా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి నేతాజీకి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. నేతాజీ జయంతిని పురస్కరించుకొని ఏడాదిగా పరాక్రమ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశ స్వాంతంత్ర్య పోరాటంలో ప్రాణాలొదిలిన అనేక మంది సైనికులకు ఈ విగ్రహం ప్రతిరూపంగా నిలుస్తుందని పేర్కొన్నారు.

బ్రిటిషర్ల ముందు తల వంచని పరాక్రమ నేత నేతాజీ అని మోదీ కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలు, భావితరాలకు ఈ విగ్రహం స్ఫూర్తి నింపుతుందన్నారు. ‘నేను చేయగలను. చేస్తాను’ అనే నేతాజీ నినాదాలతో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ‘ఇది కేవలం విగ్రహం మాత్రమే కాదు. దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం ధారపోసిన నేతాజీకి ఘనమైన నివాళి’ అని మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే గ్రానైట్‌తో బోస్‌ మరో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని