Modi: కొత్త ఎంపీల బాధను అర్థం చేసుకోండి: రాజకీయ పార్టీలకు మోదీ పిలుపు
పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలకు (Winter Session) ముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (modi) మీడియాతో మాట్లాడారు. చర్చలు ఫలప్రదంగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు.
దిల్లీ: పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాలు (Winter Session) మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్‌కు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Modi).. మీడియాతో మాట్లాడారు. జీ20కి భారత్ అధ్యక్షత వహించిన వేళ.. ఈ సమావేశాలు జరుగుతుండటం ప్రాధాన్యమని అన్నారు. చర్చలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రధాని ప్రతిపక్షాలను కోరారు. కొత్త ఎంపీలకు సభలో అవకాశాలు కల్పించాలని అన్నారు.
‘‘శీతాకాల సమావేశాలకు నేడు తొలి రోజు. ఈ ఏడాది ఆగస్టు 15తో స్వతంత్ర భారతావనికి 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఇక మనముందు ఉన్నది ఆజాదీకా అమృత్ కాల్. జీ20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహిస్తున్న వేళ.. ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమావేశంలో భారత్ ఘనమైన చోటు దక్కించుకుంటోంది. మన దేశంపై అంచనాలు పెరుగుతున్నాయి. ప్రపంచ వేదికలపై మన భాగస్వామ్యం పెరుగుతోంది. ఇప్పుడు జీ20 సదస్సుకు అధ్యక్షత వహించే అదృష్టం లభించింది. జీ20 కేవలం దౌత్య సమావేశం మాత్రమే కాదు. మన సామర్థ్యాన్ని ప్రపంచం ముందు ప్రదర్శించేందుకు వచ్చిన అద్భుత అవకాశం’’ అని మోదీ(Modi) తెలిపారు.
దేశాన్ని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నాలు జరగాలని మోదీ ఆకాంక్షించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కోరారు. ఈ చర్చలు సానుకూలంగా, ఫలప్రదంగా జరుగుతాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘కొత్త ఎంపీలు, యువ సభ్యులకు చర్చల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలను కోరుతున్నా. ప్రజాస్వామ్య దేశంలో మరో తరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉంది. సభలకు ఆటంకం జరిగితే కొత్త ఎంపీలు మాట్లాడేందుకు అవకాశం ఉండదు. వారి బాధను అర్థం చేసుకోండి’’ అని ప్రధాని ఉభయ సభల సభ్యులను కోరారు.
బుధవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాలు ఈ నెల 29 వరకు కొనసాగుతాయి. మొత్తం 23 రోజుల వ్యవధిలో ఉభయ సభలు 17 దఫాలు భేటీకానున్నాయి. 16 కొత్త వాటితో సహా 25 బిల్లులకు పార్లమెంటు ఆమోదం పొందాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుండగా కీలకమైన మూడు బిల్లులను స్థాయీ సంఘం పరిశీలనకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుపడుతోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
USA: భారత వ్యతిరేకి ఇల్హాన్ ఒమర్‌కు షాక్..!
-
India News
Layoffs: దిగ్గజ కంపెనీలు తొలగిస్తుంటే.. కార్లను బహుమతిగా ఇచ్చిన ఐటీ కంపెనీ..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
Crime News
Crime news: అనుమానంతో భార్యను చంపి.. సమాధిపై మొక్కల పెంపకం!
-
Movies News
Shah Rukh Khan: షారుక్‌ను ఎవరితోనూ పోల్చొద్దు.. హాలీవుడ్ జర్నలిస్ట్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!
-
World News
Rishi Sunak: సునాక్ మీరు బిలియనీరా..? బ్రిటన్ ప్రధాని సమాధానమిదే..