గురుద్వారాలో మోదీ పూజలు

అత్యంత ప్రసిద్ధి గాంచిన 17వ శతాబ్దానికి చెందిన దిల్లీలోని గురుద్వారాలో ప్రధాని మోదీ శనివారం ఉదయం పూజలు చేశారు. సిక్కు గురువు గురు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతి సందర్భంగా ప్రధాని పురాతన సిస్‌ గంజ్‌ సాహెబ్‌ గురుద్వారాలో పూజలు నిర్వహించారు....

Updated : 01 May 2021 12:34 IST

దిల్లీ: 17వ శతాబ్దానికి చెందిన దిల్లీలోని ప్రముఖ గురుద్వారాలో ప్రధాని మోదీ శనివారం ఉదయం పూజలు చేశారు. సిక్కు గురువు గురు తేగ్‌ బహదూర్‌ 400వ ప్రకాశ్‌ పర్వ్‌ (జయంతి) సందర్భంగా ప్రధాని పురాతన సిస్‌ గంజ్‌ సాహెబ్‌ గురుద్వారాలో పూజలు నిర్వహించారు. ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు లేకుండానే ప్రధాని గురుద్వారాను సందర్శించినట్లు ప్రధానమంత్రి అధికార కార్యాలయం (పీఎంఓ) వెల్లడించింది.

గురు తేగ్‌ బహదూర్‌ 400వ జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ ట్విటర్‌ ద్వారా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిజయజేశారు. ‘ఈ ప్రత్యేకమైన రోజున శ్రీ గురు తేగ్ బహదూర్ జీకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దౌర్జన్యాలను, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన చూపించిన ధైర్యం, తెగువ.. అణగారిన ప్రజలకు చేసిన సేవతో ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందారు.  ఆయన చేసిన త్యాగాలు ఎంతో మందిలో స్ఫూర్తి, ప్రేరణను నింపాయి’ అని పేర్కొన్నారు.

గురు తేగ్‌ బహదూర్ 400వ జయంతిని పురస్కరించుకుని ప్రధాని మోదీ ఇటీవల ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరిందర్ సింగ్‌, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కూడా ఆ సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని