Modi: బలమైన భారత్‌ కోసమే ఈ బడ్జెట్‌: ప్రధాని

కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు ప్రధాని నరేంద్రమోదీ దాని గురించి భాజపా కార్యకర్తలతో మాట్లాడారు.

Published : 02 Feb 2022 14:19 IST

దిల్లీ: కేంద్రం ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు ప్రధాని నరేంద్రమోదీ భాజపా కార్యకర్తలతో మాట్లాడారు. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ వివరాలను సకాలంలో సమగ్రంగా వివరించారని తెలిపారు. ఈ బడ్జెట్‌.. పేదలు, మధ్యతరగతి, యువతకు ప్రాథమిక సదుపాయాలు కల్పించడంపైనే ప్రధానంగా దృష్టిసారించిందన్నారు. వాటిని సక్రమంగా అందించడంపైనే తాము పనిచేస్తున్నట్లు చెప్పారు.

‘కొవిడ్ తర్వాత సరికొత్త ప్రపంచ క్రమానికి అవకాశం ఏర్పడింది. అలాగే ప్రపంచ దేశాలు భారత్‌ను చూసే దృష్టి కోణంలో చాలా మార్పు వచ్చింది. అవి బలమైన భారత్‌ను కోరుకుంటున్నాయి. ఈ సమయంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి, దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లడం మనకు అత్యవసరం’ అని దీర్ఘకాలిక వ్యూహాల ఆవశ్యకతను వెల్లడించారు. గత ఏడేళ్ల కాలంలో ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ పరిధిని పెంచుకుంటూ పోతున్నాయన్నారు.

ప్రస్తుత బడ్జెట్‌లో భారత్‌ను ఆధునికీకరించే దిశగా చర్యలున్నాయని చెప్పారు. ‘సేంద్రీయ వ్యవసాయంపై దృష్టి పెట్టి, వ్యవసాయాన్ని ఆధునికీకరించడంపై ముందుకెళ్తున్నాం. దీంతో వ్యవసాయం లాభసాటిగా మారుతుంది. తక్కువ ధరల్లో కిసాన్ డ్రోన్లు, ఇతర పరికరాలు అందుబాటులోకి వస్తాయి’ అని తెలిపారు. అలాగే సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాల అభివృద్ధి దిశగా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని