Mann Ki Baat: ‘మన్‌ కీ బాత్‌’ రిటర్న్స్‌.. ఐడియాల కోసం ప్రధాని పిలుపు!

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘మన్‌ కీ బాత్‌’కు తాత్కాలికంగా బ్రేక్‌ పడగా.. జూన్‌ 30 నుంచి మళ్లీ మొదలుకానుంది.

Published : 18 Jun 2024 17:04 IST

దిల్లీ: దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి చేసే రేడియో ప్రసంగం ‘మన్‌ కీ బాత్‌’ (Mann Ki Baat) మళ్లీ మొదలు కానుంది. జూన్‌ 30న 111వ ఎపిసోడ్‌తో ఈ కార్యక్రమం పునఃప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ స్వయంగా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఆలోచనలు, సూచనలు పంచుకోవాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే.

‘‘ఎన్నికల కారణంగా కొన్ని నెలల విరామం తర్వాత ‘మన్‌ కీ బాత్‌’ మళ్లీ రానుందని చెప్పడం సంతోషంగా ఉంది. జూన్‌ 30న ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. ఇందుకు మీ ఆలోచనలు, సూచనలను పంచుకోవాలని పిలుపునిస్తున్నా. MyGov ఓపెన్‌ ఫోరమ్‌, NaMo యాప్‌ లేదా 1800 11 7800 ఫోన్‌ నంబర్‌ ద్వారా పౌరులు తమ అభిప్రాయాలను పంచుకోవాలి’’ అని ఎక్స్‌ వేదికగా ప్రధాని మోదీ సూచించారు.

0.001% నిర్లక్ష్యం ఉన్నా’.. నీట్‌ వివాదంపై ‘సుప్రీం’ సీరియస్‌

ప్రతి నెల చివరి ఆదివారంలో వచ్చే ‘మన్‌ కీ బాత్‌’.. 110వ ఎపిసోడ్‌ ఈ ఏడాది ఫిబ్రవరి 25న ప్రసారం అయ్యింది. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తొలిసారి ఓటు హక్కు పొందిన యువతీ యువకులు పెద్ద సంఖ్యలో సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తదుపరి ఎపిసోడ్‌ను ఉద్దేశిస్తూ.. 111 సంఖ్యకు ఎంతో విశిష్టత ఉందన్నారు. అనంతరం ఎన్నికల కోడ్‌ రావడంతో మూడు నెలలకుపైగా ఆ కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. తొలి ప్రసంగంలో ఏ అంశాలు పంచుకుంటారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని