PM Modi: వ్యూహాత్మక సాంకేతిక బంధం మరింత బలోపేతం

భారత్, అమెరికాల మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక సాంకేతిక బంధం మరింత బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లో బంధం బలోపేతం కావడానికి జరుగుతున్న వేగవంతమైన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

Published : 18 Jun 2024 04:35 IST

అమెరికా జాతీయ భద్రత  సలహాదారుతో మోదీ

దిల్లీ: భారత్, అమెరికాల మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక సాంకేతిక బంధం మరింత బలోపేతానికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య అన్ని రంగాల్లో బంధం బలోపేతం కావడానికి జరుగుతున్న వేగవంతమైన ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్‌ సలీవాన్‌ సోమవారం దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. అనంతరం సమావేశ వివరాలను ప్రధాని ఎక్స్‌లో పంచుకున్నారు. ‘సలీవాన్‌తో భేటీ ఆయ్యాను. భారత్, అమెరికా సంబంధాల బలోపేతానికి మేం కట్టుబడి ఉన్నామని చెప్పాను’ అని ప్రధాని పేర్కొన్నారు. 

  • ద్వైపాక్షిక సంబంధాల్లోని క్రిటికల్‌ అండ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీ (ఐసీఈటీ) అయిన సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధతోపాటు టెలికాం, రక్షణ, కీలక ఖనిజాలు, అంతరిక్షం, ఇతర అంశాలపై పురోగతిని ప్రధానికి సలీవాన్‌ వివరించారు.
  • మోదీతో భేటీకి ముందు జాతీయ భద్రత సలహాదారు అజీత్‌ డోభాల్‌తో సలీవాన్‌ భేటీ అయ్యారు. ఐసీఈటీ వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. 
  • సలీవాన్‌ సోమ, మంగళవారాల్లో భారత్‌లో పర్యటిస్తున్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని