PM Modi: నూతన జాతీయ విద్యావిధాన రూపకల్పనలో.. వారి సహకారం ఎంతో: ప్రధాని మోదీ

నూతన జాతీయ విద్యావిధాన రూపకల్పనలో లక్షలాది మంది ఉపాధ్యాయుల తోడ్పాటు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 

Published : 12 May 2023 21:48 IST

అహ్మదాబాద్‌: లక్షల మంది ఉపాధ్యాయుల (Teachers) సహకారంతోనే నూతన జాతీయ విద్యావిధాన ( National Education Policy) రూపకల్పన సాధ్యమైందని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra modi) పేర్కొన్నారు. గుజరాత్‌ (Gujarat)లోని గాంధీనగర్‌ (Gandhinagar)లో ఆల్‌ ఇండియా ప్రైమరీ టీచర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన 29వ అఖిల భారతీయ శిక్షా సంఘ్‌ అధివేషన్‌ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ‘టీచర్స్ ఆర్ హార్ట్ ఆఫ్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్' అనే థీమ్‌తో ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘ప్రస్తుతం మన విద్యావ్యవస్థ ఎంతో రూపాంతరం చెందుతోంది. ఉపాధ్యాయులు, పిల్లల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇలాంటప్పుడు భవిష్యత్తుల్లో ఎలా ముందుకు వెళ్తామనేది ముఖ్యం. ఇకపై నూతన విద్యావిధానం ఎలా ఉండాలి అనే అంశంపై ఉపాధ్యాయులతో చర్చ జరిపాం. నూతన జాతీయ విద్యావిధానం (NEP) రూపొందించటంలో ఈ చర్చలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం భారతదేశం 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఈ అవసరాల దృష్టిలో ఉంచుకుని నూతన విద్యావిధానం రూపుదిద్దడమైంది. లక్షలాది ఉపాధ్యాయులు సహకారంతోనే ఇది సాధ్యమైంది’ అని మోదీ ప్రసంగించారు. గుజరాత్‌ పర్యటనలో ఉన్న మోదీ సుమారు రూ. 4,400 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని