PM-KISAN: రేపు ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ సొమ్ము.. ఎల్లుండి మరో కొత్త పథకానికి శ్రీకారం 

ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం- కిసాన్‌) తర్వాతి విడత మొత్తాలు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఏడాదికి రూ.6000 చొప్పున రైతులకు అందించే ఈ పథకంలో నాలుగు నెలలకోసారి రూ.2వేలు చొప్పున కేంద్రం విడుదల చేస్తున్న సంగత....

Published : 08 Aug 2021 23:30 IST

దిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎం- కిసాన్‌) తర్వాతి విడత మొత్తాలు సోమవారం రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఏడాదికి రూ.6000 చొప్పున రైతులకు అందించే ఈ పథకంలో నాలుగు నెలలకోసారి రూ.2వేలు చొప్పున కేంద్రం విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలువురు రైతులతో ప్రధాని ముచ్చటించనున్నారు. పీఎం-కిసాన్‌ ద్వారా 9.75 కోట్ల మంది రైతులకు రూ.19,500 కోట్ల మేర నిధులు విడుదల చేయనున్నట్లు ప్రధాని మంత్రి కార్యాలయం వెల్లడించింది.

అలాగే, దారిద్ర్యరేఖకు దిగువన ఉండే మహిళలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్‌ అందించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఉజ్వల పథకానికి (ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవై) కొనసాగింపుగా ఉజ్వల 2.0 పథకానికి ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 10న మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు, జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నట్లు పీఎంవో తెలిపింది. 5 కోట్ల మందికి లబ్ధిదారులకు కనెక్షన్లు అందించే లక్ష్యంగా 2016లో ఉజ్వల 1.0ను ప్రారంభించారు. తాజాగా బడ్జెట్‌లో ఉజ్వల 2.0 గురించి ప్రకటించారు. ఈ సారి కోటి మందికి ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు అందించే లక్ష్యంతో ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు. రేషన్‌కార్డు, అడ్రస్‌ ప్రూఫ్‌ లేకపోయినా తక్కువ పేపర్‌ వర్క్‌తో ఎల్పీజీ కనెక్షన్‌ ఇవ్వనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని