PM Modi: సభలో ‘మోదీ’ నాదం.. చప్పట్లు కొడుతూ ప్రధానికి స్వాగతం!

పార్లమెంటు రెండో విడత బడ్జెట్  సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో ఉభయ సభలు ఉదయం 11 గంటలకే సమావేశమయ్యాయి.

Published : 14 Mar 2022 16:19 IST

దిల్లీ: పార్లమెంటు రెండో విడత బడ్జెట్  సమావేశాలు నేడు ప్రారంభమయ్యాయి. కొవిడ్ ఉద్ధృతి తగ్గడంతో ఉభయ సభలు ఉదయం 11 గంటలకే సమావేశమయ్యాయి. లోక్‌సభ ప్రారంభంకాగానే.. సభలో నరేంద్ర మోదీ నినాదాలు మార్మోగాయి. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో కమలదళం విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని మోదీని అభినందిస్తూ భాజపా సభ్యులు సభలో బల్లలు చరిచారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రవేశించగానే  భాజపా ఎంపీలు, మంత్రులు జై భారత్ నినాదాలు చేశారు. మోదీ.. మోదీ అంటూ..  నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు