PMFBY: 60% తగ్గిన పీఎంఎఫ్‌బీవై బీమా చెల్లింపులు

ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద పంటలకు కేంద్రం బీమా కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బీమా చెల్లింపులు 60శాతం తగ్గాయట. 2020-21 పంటకాలానికి కేవలం రూ. 9,570కోట్ల మేర బీమా చెల్లింపులు జరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. అదే 2019-20లో బీమా

Published : 31 Oct 2021 23:55 IST

దిల్లీ: ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన కింద పంటలకు కేంద్రం బీమా కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది బీమా చెల్లింపులు 60శాతం తగ్గాయట. 2020-21 పంటకాలానికి కేవలం రూ. 9,570కోట్ల మేర బీమా చెల్లింపులు జరిగాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అదే 2019-20లో బీమా చెల్లింపుల మొత్తం రూ. 27,398 కోట్లుగా ఉంది. 2019-20, 2020-21కి సంబంధించి బీమా మొత్తాన్ని కేంద్రం పూర్తిగా చెల్లించినట్లు తెలుస్తోంది. 

2020-21 కాలానికి 6.12 కోట్ల మంది రైతులకు పీఎం ఫసల్‌ బీమా కింద రూ. 1,93,767 కోట్లు బీమా చేయగా.. రూ.9,570కోట్లు మాత్రమే చెల్లింపులు జరిగాయి. వీటిలో ఖరీప్‌ సీజన్‌లో రూ.6,779కోట్లు, రబీ సీజన్‌లో రూ.2,792కోట్లు పంట నష్టపోయిన రైతులకు పరిహారంగా అందాయి. దీని బట్టి ఈ ఏడాదిలో భారీ పంట నష్టాలు ఏమీ జరగలేదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నాయి. 2020-21లో పంట నష్ట పరిహారం గరిష్ఠంగా రూ.3,602కోట్లు రాజస్థాన్ రైతులకు చెల్లించగా.. ఆ తర్వాత మహారాష్ట్రకు రూ.1,232 కోట్లు, హరియాణాకు రూ. 1,112.8 కోట్లు చెల్లించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని