Modi: నా తల్లికి 100 సంవత్సరాలు..అయినా, అలాంటి వాటికి తావివ్వలేదు..!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమేఠీలో పర్యటించిన ప్రధాని మోదీ.. వారసత్వ రాజకీయాలను నడుపుతోన్న పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తన జీవితంలో అలాంటివాటికి తావు లేదని చాటి చెప్పారు. 

Published : 25 Feb 2022 01:36 IST

అమేఠీ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమేఠీలో పర్యటించిన ప్రధాని మోదీ.. వారసత్వ రాజకీయాలను నడుపుతోన్న పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో తన జీవితంలో అలాంటి వాటికి తావు లేదని చాటి చెప్పారు. 

‘మా అమ్మ, నేను ఇద్దరం టీకా తీసుకున్నాం. ఆమెకు 100 సంవత్సరాలు. అలాగని టీకా కోసం అందరికంటే ముందుగా వెళ్లిపోలేదు. ఆమె వంతు వచ్చేవరకు ఎదురుచూసి, టీకా తీసుకుంది. ఆమెకు అంత వయస్సున్నా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇంకా బూస్టర్ డోసు కూడా తీసుకోలేదు. అదే వారసత్వ రాజకీయాల విషయంలో అయితే.. వాళ్ల వారికి ముందుగా టీకా అందేలా చూసుకునే వారు’ అంటూ సమాజ్‌వాదీ, కాంగ్రెస్ పార్టీలను తీవ్రంగా విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రజలకు కొవిడ్ టీకాలు ఉచితంగా అందించిందన్నారు. అదే వారైతే.. టీకాలను విక్రయించేవారని దుయ్యబట్టారు. 

అమేఠీ ఎప్పటినుంచో ఇందిరాగాంధీ కుటుంబానికి కంచుకోట. కానీ, 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాజపా ఆ కోటను బద్దలుకొట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఓడించి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ అక్కడి నుంచి అనూహ్య విజయం సాధించారు. ప్రస్తుతం ఏడు దశల్లో యూపీలో పోలింగ్ జరుగుతుండగా.. మార్చి 10 న కౌంటింగ్ చేపట్టనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని