National Technology Day: అటల్‌జీ.. మీ ధైర్యం అమోఘం..!

నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ.. శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. 1998లో పొఖ్రాన్‌లో అణు పరీక్షలు విజయంతం కావడానికి దోహదపడిన వారి ప్రతిభను ప్రశంసించారు. అలాగే ఆనాటి సంఘటనల సమాహారమైన వీడియోను షేర్ చేశారు.

Published : 11 May 2022 15:47 IST

దిల్లీ: నేషనల్ టెక్నాలజీ డేను పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ.. శాస్త్రవేత్తల కృషిని కొనియాడారు. 1998లో పొఖ్రాన్‌లో అణు పరీక్షలు విజయంతం కావడానికి దోహదపడిన వారి ప్రతిభను ప్రశంసించారు. అలాగే ఆనాటి సంఘటనల సమాహారమైన వీడియోను షేర్ చేశారు.

‘ఈ నేషనల్ టెక్నాలజీ రోజున మన శాస్త్రవేత్తలకు అభినందనలు. 1998లో పొఖ్రాన్ అణుపరీక్షలు విజయవంతమయ్యేలా వారు చేసిన కృషికి అభినందనలు. ఈ సమయంలో అత్యుత్తమ ధైర్యం, రాజనీతిజ్ఞతను ప్రదర్శించిన అటల్ బిహారీ వాజ్‌పేయీ నాయకత్వాన్ని గర్వంగా స్మరించుకుందాం’ అంటూ ప్రధాని ట్వీట్ చేశారు. అలాగే ఆయన షేర్ చేసిన వీడియోలో రాజస్థాన్‌లోని పొఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించిన ప్రదేశం కనిపిస్తోంది. అక్కడ చేపట్టిన మూడు భూగర్భ అణు పరీక్షలు విజయవంతమయ్యాయని వాజ్‌పేయీ చేసిన ప్రకటన అందులో వినొచ్చు. ‘వాజ్‌పేయీ నాయకత్వంలో అణు పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్‌ తన అపార శక్తిసామర్థ్యాలను, ధైర్యాన్ని ప్రపంచానికి చాటింది’ అంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఈ పరీక్షలు నిర్వహించిన మే 11నే దేశం నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటోంది. ఇవి విజయవంతమైన తర్వాత భారత్‌ న్యూక్లియర్ స్టేట్ అంటూ వాజ్‌పేయీ ప్రకటన చేశారు. దాంతో న్యూక్లియర్ క్లబ్‌లో చేరిన ఆరో దేశంగా భారత్‌ నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని