POK: మరో రెండేళ్లలో పీఓకే భారత్‌లోకే..! హరియాణా మంత్రి సంచలన వ్యాఖ్యలు

హరియాణా మంత్రి కమల్‌ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే(POK) గురించి తన అభిప్రాయాలను వెల్లడించిన ఆయన.. విపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. 

Updated : 06 Mar 2023 18:08 IST

చండీగఢ్‌: పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌(POK)ను ఉద్దేశించి హరియాణా(Haryana)మంత్రి కమల్ గుప్తా(Kamal Gupta ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండుమూడేళ్లలో పీఓకే.. భారత్‌లో భాగమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు రోహ్‌తక్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. 

‘2014కు ముందు మనదేశం అంతబలంగా లేదు. కానీ ఇప్పుడు దృఢంగా మారింది. కశ్మీర్‌లో కొంతభాగాన్ని పాకిస్థాన్‌ ఆక్రమించింది. అక్కడ భారత్‌తో కలవాలనే ఆకాంక్షలు వినిపిస్తున్నాయి. రానున్న రెండుమూడు సంవత్సరాల్లో ఏ క్షణమైనా పీఓకే.. భారత్‌లో భాగం కావొచ్చు. అది ప్రధాని మోదీ(Modi) నాయకత్వంలోనే సాధ్యం అవుతుంది’ అని గుప్తా అన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీపైనా విమర్శలు గుప్పించారు. మెరుపుదాడులు (సర్జికల్‌  స్ట్రైక్స్‌) చేసి చాలామంది ముష్కరుల్ని చంపినట్లు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. దానికి తగ్గ రుజువుల్ని చూపించాలంటూ ఆ పార్టీ నేతల నుంచి వచ్చిన డిమాండ్లను తప్పుపట్టారు. అలాగే ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) నేతృత్వంలో జరిగిన భారత్‌ జోడో యాత్ర(Bharat Jodo Yatra)గురించి మాట్లాడుతూ.. ‘భారతదేశాన్ని ఏకం చేస్తామంటూ మాటలు చెప్పేవారే దానిని విచ్ఛిన్నం చేస్తున్నారు’ అని మండిపడ్డారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని