Uttar Pradesh: సెలవులివ్వని అధికారులు.. చిన్నారిని కోల్పోయిన కానిస్టేబుల్‌

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్‌ తన చిన్నారి బాబు మృతదేహాన్ని తీసుకుని సీనియర్‌ ఎస్పీ కార్యాలయానికి ఆవేదనతో వచ్చారు.

Updated : 13 Jan 2023 08:54 IST

ఈటీవీ భారత్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ కానిస్టేబుల్‌ తన చిన్నారి బాబు మృతదేహాన్ని తీసుకుని సీనియర్‌ ఎస్పీ కార్యాలయానికి ఆవేదనతో వచ్చారు. తాను అబద్ధపు కారణాలతో సెలవులు అడగలేదని చెప్పడానికి సాక్ష్యంగా ఆయన ఈ పని చేశారు. మథుర ప్రాంతానికి చెందిన సోనూ చౌధరి బైద్‌పుర్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. శస్త్రచికిత్స జరిగిన భార్యను, రెండేళ్ల బాబును చూసుకునేందుకు సెలవు కావాలని ఈ నెల 7న తన పైఅధికారుల్ని అభ్యర్థించారు. అయినా సెలవు మంజూరు కాలేదు. బుధవారం మధ్యాహ్నం సోనూ విధులకు హాజరుకాగా, అనారోగ్యంతో భార్య ఇంట్లోనే ఉంది. వారి కుమారుడు హర్షిత్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లి నీటి గుంటలో పడిపోయాడు. ఎంతకీ హర్షిత్‌ తిరిగి ఇంటికి రాకపోడటంతో బయటకు వెళ్లి ఆమె వెతకగా గుంటలో కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తనకు సెలవు ఇవ్వకపోవడం వల్ల ఏం జరిగిందో చెప్పడానికి సాక్ష్యంగా ఆ బాబు మృతదేహంతో ఎస్‌ఎస్‌పీ కార్యాలయానికి సోనూ వెళ్లారు. ఎస్పీ స్పందించి విచారణకు ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు