ఎర్రకోట ఘటన..దేశద్రోహం కేసు నమోదు!

దిల్లీలో ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, ఆ ఘటనకు సంబంధించి తాజాగా దేశద్రోహం కేసు నమోదు చేశారు.

Updated : 29 Jan 2021 06:24 IST

దర్యాప్తు జరుపుతున్న దిల్లీ పోలీసులు

దిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీ ట్రాక్టర్‌ ర్యాలీ సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలపై దిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇందులో భాగంగా, ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణించిన అధికారులు, ఆ ఘటనకు సంబంధించి తాజాగా దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 124A(దేశద్రోహం) ప్రకారం కేసు నమోదు చేసిన దిల్లీ పోలీసులు, దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే, ఎర్రకోట ఘటనకు సంబంధించి ఇప్పటికే పంజాబీ నటుడు దీప్‌ సిద్ధూ, గ్యాంగ్‌స్టర్‌ నుంచి సామాజిక కార్యకర్తగా మారిన లఖాసిధానాలపై దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే.

జనవరి 26న రైతులు చేపట్టిన ట్రాక్టర్‌ ర్యాలీలో భాగంగా, ఘజీపూర్‌ సరిహద్దు నుంచి బయలుదేరిన ఆందోళనకారులు ఆదాయపు పన్ను కార్యాలయ కూడలికి చేరుకొని పోలీసులతో ఘర్షణకు దిగారు. అనంతరం పోలీసుల వలయాన్ని ఛేదించుకొన్న ఆందోళనకారులు, ఎర్రకోటకు చేరుకొని అక్కడ జెండా ఎగరవేశారు. హింసాత్మక సంఘటనలతో పాటు ఎర్రకోట ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ప్రభుత్వం, వీటి దర్యాప్తులపై దిల్లీ పోలీసులకు పలు సూచనలు చేసింది. తాజాగా ఆ ఘటనపై దేశద్రోహం కేసు నమోదుచేసింది.

ఇదిలాఉంటే, దిల్లీలో హింసాత్మక ఘటనలకు కారణమైనందుకు న్యాయపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలపాలంటూ దాదాపు 20రైతు సంఘాల నాయకులకు దిల్లీ పోలీసులు నోటీసులు పంపించారు. వీటిపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా కేసులు నమోదైన రైతు సంఘాల నాయకుల పాస్‌పోర్టులను పోలీసులకు సరెండర్‌ చేయాలని ఆదేశించిన పోలీసులు, వారిపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు.

ఇవీ చదవండి..
దిల్లీ ఘటన: దీప్‌ సిద్ధూ ఎక్కడ?
రైతు నేతలపై టుక్‌ ఔట్‌ నోటీసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు