Renukaswamy Murder Case: రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్‌!

చిత్రదుర్గలో నటుడు దర్శన్‌ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Published : 16 Jun 2024 18:20 IST

బెంగళూరు: కర్ణాటకలో సంచలనంగా మారిన రేణుకాస్వామి (28) హత్య కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ఇప్పటికే సినీనటుడు దర్శన్‌, నటి పవిత్రాగౌడతో పాటు పలువురిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.  రేణుకాస్వామిని కిడ్నాప్‌ చేసేందుకు దర్శన్‌ గ్యాంగ్‌ వాడిన కారును పోలీసులు ఆదివారం సీజ్‌ చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న రవి అనే వ్యక్తి చిత్రదుర్గ జిల్లాలోని అయ్యనహల్లి కారును పార్క్‌ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం ఈ కారును సీజ్‌ చేసిన బృందంలో ఉన్నారు.  ఈ వ్యవహారంలో పోలీసులు రవి కుటుంబ సభ్యుల్ని సైతం విచారిస్తున్నారు. కారు నుంచి పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. దర్శన్‌ అభిమాని అయిన రేణుకాస్వామి హత్యోదంతం కేసులో సినీ తారలు దర్శన్‌, పవిత్ర గౌడతో పాటు మరో 15మందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

దర్శన్‌, పవిత్రా గౌడలకు వివాహమైందా? ఆయన లాయర్‌ ఏమన్నారంటే..

మరోవైపు, రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌, పవిత్రతో పాటు 9మందికి పోలీస్‌ కస్టడీని జూన్‌ 20 వరకు న్యాయస్థానం పొడిగించింది. వైద్య పరీక్షల తర్వాత అన్నపూర్ణేశ్వరినగర పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పవిత్రా గౌడను సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌కు పంపించారు. పవిత్రకు అశ్లీల సందేశాలు పంపాడన్న కోపంతోనే రేణుకాస్వామిపై చేయి చేసుకున్నట్లు విచారణ సమయంలో దర్శన్‌ పోలీసులకు వివరించారు. రెండు దెబ్బలు కొట్టి షెడ్డు నుంచి బయటకు వచ్చానని.. మిగిలినవారు అతడిని హత్య చేసి ఆ నేరాన్ని తనపైకి నెడుతున్నారంటూ విచారణలో చెప్పినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు