Updated : 24 May 2022 18:56 IST

JK: ఉగ్ర ఘాతుకం.. ఏడేళ్ల కూతురి ముందే పోలీస్‌ను కాల్చి చంపారు!

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. ఇటీవల జమ్మూలో కశ్మీరీ పండిట్‌ వర్గానికి చెందిన రాహుల్‌ భట్‌ను అనే ఉద్యోగిని విధుల్లో ఉండగానే కాల్చి చంపిన ముష్కరులు.. తాజాగా ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఇంటి వద్ద కాల్పులు జరిపారు. ఏడేళ్ల కూతురి ముందే అతడిని కాల్చేశారు. ఈ దాడిలో పోలీస్‌ కానిస్టేబుల్‌ మృతిచెందగా.. అతడి కూతురికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. ఉగ్రదాడిలో తొలుత తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. ఈ దాడిలో మృతి చెందిన పోలీస్‌ను శ్రీనగర్‌లోని సౌరా ప్రాంతానికి చెందిన సైఫుల్లా ఖాద్రిగా గుర్తించినట్టు తెలిపారు. అయితే, బాలిక కుడి చేతికి బుల్లెట్‌ గాయం తగిలిందని.. ఆమె ప్రాణాలకు ప్రమాదంలేదన్నారు. ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. 

మరోవైపు, ఈ ఘటనపై కశ్మీర్‌ రేంజ్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పోలీసు బలగాలను రంగంలోకి దించామనీ.. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు.

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని