Adar Poonawalla: మేడిన్ ఇండియా టీకాలతోనే ఎక్కువ రక్షణ..!

కరోనా వైరస్‌ను కట్టడిచేసే విషయంలో మేడిన్‌ ఇండియా టీకాలే ఎక్కువ రక్షణ ఇచ్చాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు.

Published : 14 Apr 2022 01:18 IST

దిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడిచేసే విషయంలో మేడిన్‌ ఇండియా టీకాలే ఎక్కువ రక్షణ ఇచ్చాయని సీరమ్ ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా అన్నారు. ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలైన ఫైజర్, మోడెర్నా కంటే వాటి నుంచే రక్షణ అధికంగా ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ వార్తా సంస్థతో  మాట్లాడారు. 

‘ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలైన మోడెర్నా, ఫైజర్ కంటే మేడిన్ ఇండియా టీకాలే కరోనా నుంచి రక్షణ కల్పించడంలో మెరుగ్గా పనిచేశాయి. ఆ టీకాలను భారత్‌లో ప్రవేశపెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే అమెరికాలో ప్రజలు రెండు, మూడు బూస్టర్ డోసులు తీసుకుంటున్నారు. కానీ కరోనా ప్రభావం భారత్‌తో పోల్చుకుంటే అక్కడే ఎక్కువగా ఉంది. మన టీకాలు మంచి రక్షణ ఇస్తున్నాయి’ అని పూనావాలా పేర్కొన్నారు. అలాగే కొవిషీల్డ్ టీకాను 80కి పైగా దేశాలకు ఎగుమతి చేశామని చెప్పారు. 10 కోట్లకు పైగా డోసుల్ని పంపామని చెప్పారు. కేసులు తగ్గడంతో ప్రస్తుతం డిమాండ్ తగ్గిందన్నారు.  

భారత్‌లో మొదటి రెండు దశల్లో కరోనా ఉద్ధృతి చూపగా.. మూడో వేవ్‌లో స్వల్ప ప్రభావాన్నే చూపింది. చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో కేసులు పెరుగుతోన్న సమయంలో.. మన దేశంలో గత కొంతకాలంగా వెయ్యికి సమీపంలోనే కొత్త కేసులు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. టీకా కార్యక్రమం కింద 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ కాగా.. ప్రస్తుతం కేంద్రం ప్రికాషనరీ డోసు కూడా అందిస్తోంది. ఈ పంపిణీలో సీరమ్ సంస్థ ఉత్పత్తి చేసిన కొవిషీల్డ్ వాటానే ఎక్కువగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని