Rahul Gandhi: విద్యార్థుల ఒత్తిడిని పట్టించుకోరా.. నీట్‌ వాయిదా వేయండి!

వచ్చే ఆదివారం జరగబోయే నీట్‌ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం

Updated : 07 Sep 2021 12:46 IST

దిల్లీ: వచ్చే ఆదివారం జరగబోయే నీట్‌ పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం పట్టించుకోకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటోందని విమర్శించారు. 

సెప్టెంబరు 12న జరిగే నీట్‌ పరీక్షను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. అదే రోజున 12వ తరగతి ఇంప్రూవ్‌మెంట్‌/కంపార్ట్‌మెంట్‌ పరీక్షలు ఉన్నందున నీట్‌ను వాయిదా వేయాలని పలువురు కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించలేదు. నీట్‌ జాతీయ స్థాయి పరీక్షలు కావడంతో దాంట్లో జోక్యం చేసుకోవడం సబబు కాదని, ఒక్కశాతం మందికోసం మొత్తం వ్యవస్థను ఆపలేమని కోర్టు అభిప్రాయపడింది. 

ఈ పరిణామాలపై నేడు ట్విటర్‌ వేదికగా స్పందించిన రాహుల్‌ గాంధీ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘‘విద్యార్థుల ఒత్తిడిని ప్రభుత్వం చూడట్లేదు. నీట్‌ను వాయిదా వేయండి. వారికి న్యాయమైన అవకాశం కల్పించండి’’ అని కాంగ్రెస్‌ నేత ట్వీట్‌ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని