Updated : 24 May 2022 13:36 IST

Congress : కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల జట్టులోకి రెబల్‌ నేతలు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉదయ్‌పూర్‌లో ముగిసిన నవ సంకల్ప శిబిరంలో జరిగిన చర్చల ఆధారంగా కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల బృందం (పొలిటకల్‌ అఫైర్స్‌ గ్రూప్‌), టాస్క్‌ఫోర్స్‌-2024లను ఏర్పాటు చేసింది. దీంతోపాటు ‘భారత్‌ జోడో యాత్ర’ను సమన్వయం చేయడానికి సెంట్రల్‌ ప్లానింగ్‌ గ్రూప్‌ను కూడా సిద్ధం చేసింది. పార్టీ ఎక్స్‌ అఫీషియో మెంబర్స్‌ను కూడా వెల్లడించింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన బృందంలో గతంలో పనిచేసిన సునీల్‌ కనుగోలుకు టాస్క్‌ఫోర్స్‌-2024లో స్థానం దక్కడం విశేషం. ఈ గ్రూపులో ప్రియాంకా గాంధీకి కూడా స్థానం కల్పించారు.

పొలిటికల్‌ అఫైర్స్‌ గ్రూపులో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, గులామ్‌నబీ ఆజాద్‌, అంబికా సోనీ, దిగ్విజయ్‌ సింగ్‌, ఆనంద్‌ శర్మ, కేసీ వేణుగోపాల్‌, జిత్రేంద్ర సింగ్‌లు సభ్యులుగా ఉండనున్నారు. రెబల్‌ నేతలుగా పేరున్న ఆజాద్‌, ఆనంద్‌ శర్మలకు ఈ కమిటీలో చోటు లభించడం విశేషం.

ఇక టాస్క్‌ఫోర్స్‌-2024 బృందంలో సీనియర్‌ నేత పి.చిదంబరం, ముఖుల్‌ వాస్నిక్‌, జైరామ్‌ రమేశ్‌, కేసీ వేణుగోపాల్‌, అజేయ్‌ మాకెన్‌, ప్రియాంకా గాంధీ, రణ్‌దీప్‌ సింగ్‌సూర్జేవాలా, సునీల్‌ కనుగోలు స్థానం దక్కించుకొన్నారు.

సెంట్రల్‌ ప్లానింగ్‌ గ్రూప్‌లో దిగ్విజయ్‌ సింగ్‌, సచిన్‌ పైలట్‌, శశి థరూర్‌, రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టూ, కేజే జార్జి, జోతిమణి, ప్రద్యుత్‌ బొర్డొలోయ్‌, జితు పట్వారి, సలీమ్‌ అహ్మద్‌ను నియమించారు. ఇక ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా టాస్క్‌ ఫోర్స్‌ బృందంలోని వారు, పార్టీలోని అన్ని విభాగాల అధిపతులు వ్యవహరించనున్నారు.


Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని