Published : 05 Jan 2022 18:08 IST

Precaution Dose: ప్రికాషన్‌ డోసుపై కేంద్రం కీలక ప్రకటన.. గతంలో ఏ టీకా తీసుకుంటే అదే..!

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తోపాటు 60 ఏళ్లు పైబడిన వారికి ముందు జాగ్రత్త (ప్రికాషన్‌) డోస్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. అయితే ఏ టీకా ఇవ్వాలన్నదానిపై కేంద్రం నేడు కీలక ప్రకటన చేసింది. ప్రికాషన్‌ డోసు కోసం ఎలాంటి మిశ్రమ టీకాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకుంటే అదే టీకాను ఇస్తారని వెల్లడించింది. ఈ మేరకు నీతి ఆయోగ్‌ సభ్యులు వీకే పాల్‌ బుధవారం వెల్లడించారు. 

దేశంలో కొవిడ్‌ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ నేడు మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా వీకే పాల్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రికాషన్‌ డోసులో టీకా మార్పు ఉండదు. గతంలో ఏ టీకా తీసుకుంటే అదే ఇప్పుడు వేసుకోవాలి. మొదటి రెండు డోసులు కొవాగ్జిన్‌ తీసుకున్నవారు ముందు జాగ్రత్త డోసు కూడా కొవాగ్జినే తీసుకోవాలి. కొవిషీల్డ్ తీసుకుంటే.. ఇప్పుడూ అదే టీకా వేయించుకోవాలి’’ అని తెలిపారు. 

దేశంలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో వ్యాక్సినేషన్‌ పరిధిని మరింత విస్తరిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌తోపాటు 60 ఏళ్లు పైబడి వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి జనవరి 10 నుంచి ప్రికాషన్‌ డోస్ పంపిణీ చేయనున్నట్లు ప్రధాని మోదీ గత నెల ప్రకటించారు. వీరితో పాటు 15-18 ఏళ్ల వయసు వారికీ కరోనా టీకాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 

కోటి మందికి పైగా టీనేజర్లకు టీకా..

ఇక, 15-18 ఏళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కరోనా టీకా పంపిణీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 1.08కోట్ల మంది టీనేజర్లకు టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ‘‘దేశవ్యాప్తంగా 15-18ఏళ్ల వయసువారు 7.40కోట్ల మంది ఉన్నారు. ఇందులో 14.3శాతం మందికి తొలి డోసు వ్యాక్సిన్‌ పూర్తయ్యింది’’ అని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతానికి ఈ వయసు వారికి కొవాగ్జిన్‌ టీకా మాత్రమే అందుబాటులో ఉంది. తొలి డోసు తీసుకున్న నాలుగు వారాల తర్వాత రెండో డోసు వేయనున్నారు. 

Read latest India News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జనరల్

మరిన్ని