Droupadi Murmu: సైనాతో బ్యాడ్మింటన్‌ ఆడిన రాష్ట్రపతి ముర్ము

అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం కాసేపు రాకెట్‌ చేతపట్టారు.

Published : 11 Jul 2024 03:55 IST

దిల్లీ: అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం కాసేపు రాకెట్‌ చేతపట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌లో సరదాగా బ్యాడ్మింటన్‌ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను రాష్ట్రపతి అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ఆటలు ఆడాలంటూ చిన్నారులకు రాష్ట్రపతి సందేశమిచ్చారు. ‘హర్‌ స్టోరీ - మై స్టోరీ’ సిరీస్‌లో భాగంగా సైనా నెహ్వాల్‌ సహా పద్మ అవార్డులు అందుకున్న పలువురు మహిళలు గురువారం రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో ప్రజలతో సంభాషించనున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని