Joe Biden: మొహంలో దిగులు.. మాటల్లో తడబాటు.. ఇదీ బైడెన్ పరిస్థితి..!

మొహంలో దిగాలు.. మాటల్లో తడబాటు.. బాధతో తలవొంచి, క్షమించమని అడిగినట్లు పెట్టిన ఎక్స్‌ప్రెషన్.. ఇదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిస్థితి. అఫ్గానిస్థాన్ నుంచి హఠాత్తుగా సేనల్ని తరలించి విమర్శలు ఎదుర్కొంటోన్న బైడెన్‌కు 

Updated : 27 Aug 2021 13:41 IST

విలేకరులు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా మౌనంగా అధ్యక్షుడు 

వాషింగ్టన్: మొహంలో దిగులు.. మాటల్లో తడబాటు.. బాధతో తలవంచిన ఎక్స్‌ప్రెషన్.. ఇదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిస్థితి. అఫ్గానిస్థాన్ నుంచి హఠాత్తుగా సేనల్ని తరలించి విమర్శలు ఎదుర్కొంటోన్న బైడెన్‌కు కాబుల్ ఉగ్రదాడితో గట్టి షాక్‌ తగిలింది. ఈ ఘటనపై విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో బైడెన్‌ మొహంలో అదే ప్రతిబింబించింది. వారు ప్రశ్నలు సంధిస్తోన్న సమయంలో కొద్దిసేపు మౌనంగా ఉండిపోవడం గమనార్హం.

కాబుల్ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం జరిగిన ఉగ్రదాడిలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు. వారికి నివాళి అర్పిస్తూ శ్వేతసౌధం నుంచి బైడెన్‌ జాతినుద్దేశించి ప్రసంగించారు. మృతి చెందిన అమెరికా సైనికులను హీరోలుగా అభివర్ణించారు. ఆ సమయంలో ఆయన ముఖమంతా ఉద్వేగంతో నిండిపోయింది. అలాగే ఈ ఘాతుకానికి కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకుంటామని గట్టి ప్రతిజ్ఞ చేశారు.

మునుపటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి పగ్గాలు అందుకున్న బైడెన్.. దేశంలో ప్రశాంతత, అంతర్జాతీయంగా అమెరికాకు మరింత గౌరవం తీసుకువస్తామని వాగ్దానం చేశారు. అయితే కాబుల్ ఘటన బైడెన్ పీఠాన్ని షేక్ చేసింది. అధ్యక్షుడి నిర్ణయాలపై రిపబ్లికన్లు తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. బైడెన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరికొందరు అభిశంసనకు పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని