International Womens Day: అతివలతోనే సమాజంలో మార్పు.. నారీశక్తికి వందనం

నారీ మణులు, మహిళా శక్తి, మగువలు మహరాణులు.. ఇలా చెప్పుకుంటే పోతే మహిళల శక్తి సామర్థ్యాలను వర్ణించడానికి పదాలు అనేకం.

Updated : 08 Mar 2022 13:47 IST

మహిళా దినోత్సవం వేళ.. శుభాకాంక్షల వెల్లువ

ఇంటర్నెట్ డెస్క్: నారీమణులు, మహిళా శక్తి, మగువలు మహారాణులు.. ఇలా చెప్పుకొంటూ పోతే మహిళల శక్తి సామర్థ్యాలను వర్ణించడానికి పదాలు అనేకం. అవి మహిళా దినోత్సవం రోజున మహిళలను ఆకాశానికెత్తే అలంకారాలు మాత్రమేనా..? కానేకాదు.. పుట్టుక మొదలుకొని అడుగడుగునా ఎదురవుతోన్న సవాళ్లను సహనంతో దాటుకుంటూ.. విజయం వైపు పయనిస్తోన్న క్రమంలో వచ్చి చేరిన ఆభరణాలవి. ఈ నారీ శక్తిని ప్రపంచం గుర్తించింది కాబట్టే.. అతివల కోసం ఓ రోజును కేటాయించి.. వేడుక చేస్తోంది. మరి ఈ రోజున ప్రముఖుల నుంచి వచ్చిన శుభాకాంక్షలు ఓసారి చూద్దామా..!  

o అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలు అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి ఆశయాల సాధనకు, వారికి భద్రత కల్పించేందుకు మనం కట్టుబడి ఉందాం... రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

మహిళలు ఏ రూపంలో వివక్షకు గురికాకుండా పరిరక్షించి, లింగ తటస్థ కలిగిన ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేద్దాం. వారి భద్రతకు భరోసా ఇవ్వడం ద్వారా, సమాన అవకాశాలు కల్పించడం ద్వారా, తగిన గౌరవం ఇవ్వడం ద్వారా మహిళా సాధికారతకు సంకల్పిద్దాం... ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

కుమారుడు పుట్టినప్పుడు వేడుక చేసుకోవడానికి, కుమార్తె జన్మించినందుకు శోకించడానికి గల కారణాలు నాకు కనిపించలేదు. ఇద్దరు దేవుడిచ్చిన వరాలు అంటూ మహాత్మా గాంధీ చెప్పిన సూక్తిని షేర్ చేసి, ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ మహిళా దినోత్సవం రోజున నారీ శక్తికి వందనం. పలు రంగాల్లో వారు సాధించిన విజయాలకు అభినందనలు. వారికి తగిన గౌరవం, అవకాశాలను కల్పించే పథకాల ద్వారా భారత ప్రభుత్వం మహిళ సాధికారతపై ముందుకెళ్తుంది... ప్రధాని నరేంద్రమోదీ

సమాజాన్ని తీర్చిదిద్దడంలో విశేష కృషి చేసిన మహిళలందరికీ వందనాలు... కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ

మహిళలు తమ శక్తి, అంకిత భావం, జ్ఞానంతో ఈ సమాజంలో మార్పుతేగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు... కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ






Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని